AP Railway Corridors
* ఏపీ మీదుగా నాలుగు లేన్ల రైల్వే కారిడార్లు..
* విశాఖ, విజయవాడ, రేణిగుంట వాసులకు బంపర్ గుడ్ న్యూస్
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను వేగవంతంగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి (కేంద్ర కేబినెట్) దేశవ్యాప్తంగా 7 ప్రధాన రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల (4-Lane) ట్రాక్ ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశీయ సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. కేంద్రం ఆమోదించిన ఈ 7 కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే కీలక మార్గాలు ఉండటం విశేషం. రాష్ట్రంలోని ముఖ్య నగరాలను కలుపుతూ రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
* హౌరా – చెన్నై కారిడార్..
ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం, విజయవాడల మీదుగా 4 లేన్ల రైల్వే నెట్వర్క్ను నిర్మించనున్నారు. తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక రవాణాకు, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ లైన్ అత్యంత కీలకంగా మారనుంది. రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగయ్యేలా ముంబై-చెన్నై రైల్వే కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా 4 లేన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
* ప్రయోజనాలు ఇవి..
రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లో 4 లేన్ల నిర్మాణం వల్ల రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి పోర్టుల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా వేగవంతమవుతుంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయడమే కాకుండా, దక్షిణాది మరియు తూర్పు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
