Mulugu Voter List Revision
* ప్రత్యేక సమగ్ర సవరణ తాజా వివరాలు రాజకీయ పార్టీలకు వెల్లడించాలి.జిల్లా కలెక్టర్ .
ఆకేరు న్యూస్,ములుగు : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026కు సంబంధించిన తాజా వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వెల్లడించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఎన్నికల అధికారులను ఆదేశించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో 109–ములుగు ఎస్టీ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ను అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు పొడిగించిన నేపథ్యంలో, సవరించిన షెడ్యూల్ ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు అందిన దావాలు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారాలు–9, 10, 11 జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.
నియోజకవర్గ పరిధిలోని 308 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
