Kendriya Vidyalaya Admissions
* జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి
ఆకేరు న్యూస్, ములుగు : కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి తెలిపారు.
గురువారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలం జవహర్నగర్ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ తరగతుల్లో ప్రవేశాల కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులు, పైరవీలకు తావులేకుండా కేంద్రీయ విద్యాలయ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణతోపాటు అందుబాటులో ఉన్న సీట్లను లక్కీ డ్రా ద్వారా భర్తీ చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సిద్ధార్థ రెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రధానాచార్యులు సీతారాం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
