Chakali Ilamma Death Anniversary
* నివాళులర్పించిన బహుజన, రాజకీయ నాయకులు
ఆకేరు న్యూస్, పాలకుర్తి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన విప్లవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పీతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ… నైజాం నవాబుల మూకలను, దొరల అరాచకాలను ఎదురించి నిలబడిన ధీరోదాత్తురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. “నా భూమి – నా హక్కు” అని గర్జించి, వీరోచిత పోరాటంతో తెలంగాణ మట్టి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన ఐలమ్మ త్యాగం అమరమైనదని పేర్కొన్నారు.
* పోరాట పటిమకు ప్రతీక- ఐలమ్మ
పాలకుర్తి నేలపై ఐలమ్మ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. స్వయం సమృద్ధి, హక్కుల సాధన కోసం ఆమె సాగించిన సమరం నేటి తరానికి ఆదర్శమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
