Mulugu Collector Hemant Sahadeva Rao Inspection
* కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.

గురువారం ములుగు మండలం బండారుపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాల (బాలుర), జూనియర్ కళాశాల ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, భోజనశాల, వసతిగృహం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన, భోజన పట్టిక, సరుకుల నిల్వలకు సంబంధించిన నమోదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంటశాల, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను నిరంతరం పరిశీలిస్తూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయ బృందం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
