CM Revanth Reddy Telangana New Education Policy
* 15 శాతం నిధులు పెంచడమే లక్ష్యం – సీఎం రేవంత్
అకేరు న్యూస్, హైదరాబాద్ : విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా కొత్త విద్యా పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. విద్యాశాఖకు కేటాయించే నిధులను 15 శాతం పెంచడం తన లక్ష్యమని తెలిపారు. విద్యాశాఖను ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారంటే.. ఆ శాఖకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యాశాఖకు మంత్రి లేరంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు.
విద్యాశాఖ తన వద్ద వద్దంటే ఒక్క నిమిషంలోనే తన మిత్రులకు అప్పగించగలనని సీఎం వ్యాఖ్యానించారు. శాఖను తన వద్దే ఉంచుకోవడానికి కారణం.. విద్య అత్యంత కీలకమైన రంగం కావడమేనని స్పష్టం చేశారు. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకురావడంతో పాటు, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
