Konda Surekha Meenakshi Natarajan
* యాక్టివ్గా ఉండాలని సూచన
* అసెంబ్లీకి గైర్హాజరుపై చర్చ
ఆకేరు న్యూస్, వరంగల్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
* పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలని సూచన..
కొండా సురేఖ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండకుండా కాంగ్రెస్లో యాక్టివ్గా కొనసాగాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.
* నేడు అసెంబ్లీకి వస్తారా?..
మీనాక్షి నటరాజన్ సూచనల నేపథ్యంలో కొండా సురేఖ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు ఆమె గైర్హాజరవుతుండటంతో తాజా ఫోన్ సంభాషణ తర్వాత ఆమె వైఖరిలో మార్పు ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబానికి ఉన్న ప్రభావం దృష్ట్యా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా చూస్తోంది.
ఈ నేపథ్యంలో సురేఖను పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా కొనసాగించేలా అధిష్ఠానం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా.. మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్తో కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగులపై ఉత్కంఠ నెలకొంది. నేటి అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరవుతారా? పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ యాక్టివ్గా మారతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
