Suryapet Farmers Protest
* రాస్తారోకోతో స్తంభించిన ట్రాఫిక్
ఆకేరు న్యూస్, సూర్యాపేట : వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందంటూ రైతులు రోడ్డెక్కారు. మండల పరిధిలోని ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో జనగాం రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* 24 గంటల కరెంటు ఏమైంది?..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిందని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నీరందక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
* కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం..
విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వెంటనే తొలగించి పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
