హనుమకొండ లో 8 ఏళ్ళ బాలిక పై 30 ఏళ్ళ యువకుడి అత్యాచార యత్నం
* 8 ఏళ్ళ బాలిక పై 30 ఏళ్ళ యువకుడి అత్యాచార యత్నం
* నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు.
* రిమాండ్కు తరలించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హసన్ పర్తి : హనుమకొండలో దారుణం జరిగింది. మైనర్ బాలికను (Minor Girl) నమ్మించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఉన్న ప్లంబర్ పనిచేసే ఓ యువకుడిని బాలిక తన తల్లికి ఫోన్ చేయమని అడిగింది. ఫోన్ చేస్తానని ఇంట్లోకి పిలిచి నమ్మించి బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బలవంతంగా బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అతని చేతిని కొరకడంతో బాలికను వదిలేశాడు. ఇంట్లోనుంచి బయటకు పరుగెత్తి తన తల్లికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు (POCSO Case) నమోదు చేసి యువకుడిని రిమాండ్ కు తరలించామని కేయూ పోలిస్ అధికారి తెలిపారు..
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
