* తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ముసురు
* పలు ప్రాంతాల్లో భారీ వాన
* జలాశయాల గేట్లు ఎత్తివేత
* వరద నష్టాలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ వర్షాల (Heavy rains) కు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ని కొన్ని ప్రాంతాలు ఆగమాగవుతున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) లో కొన్నిచోట్ల వాన ముసురేయగా.. మరికొన్ని చోట్ల వర్షం దంచికొడుతోంది.మరో వైపు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో (Five Districts) రెడ్ అలర్ట్ (Red alert) ఉండగా 10 జిల్లాల్లో (Ten Districts) ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించారు. ఉత్తర తెలంగాణ (North Telangana) లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్(Hyderabad) లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.
ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather station) హెచ్చరించింది. భారీ వర్షాలకు గోదావరి (Godavari) లో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ (CWC)అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున ఇంకా గోదావరిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు 44 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరో వైపు భద్రాచలంలోని తాలిపేరు జలాశయాని (Thaaliperu Jalashayam) కి భారీగా వరద కొనసాగుతున్నది. దాంతో అధికారులు ప్రాజెక్టు 26గేట్లు ఎత్తివేశారు.
హైదరాబాద్లో
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad is the capital of Telangana) ను కూడా ముసురు వీడడం లేదు. కొన్నిచోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీగా వాన దంచికొడుతోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిని మళ్లించే చర్యలను చేపడుతున్నారు. కాగా, వరద ఉధృతి పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా హుస్సేన్ సాగర్ 2 గేట్ల (Hussain Sagar 2 gates) ను అధికారులు ఎత్తివేశారు. అలాగే, మూరీ పరివాహక ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇదిలాఉండగా, వరదలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) అశ్వారావుపేట మండలం (Ashwaropeta Mandal) లోని పెద్దవాగుకు గండిపడి రైతులు పెద్ద నష్టపోయారని మంత్రి తుమ్మల (Minister thummala).. సీఎం రేవంత్ (CM Revanth) దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని, బాధితులను ఆదుకుంటామని రేవంత్ (Revanth) హామీ ఇచ్చారు.
———————–