Maha Ganapathi at Khairatabad
Maha Ganapathi at Khairatabad : ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించిన మహాగణపతికి కాసేపట్లో తొలి పూజలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా బడా గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు ఈ ఏడాదితో 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఒకప్పుడు కేవలం ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్.. కాలక్రమంలో భారీ రూపాన్ని సంతరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. అయితే కరోనా తర్వాత విగ్రహం ఎత్తును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మట్టి గణపతిని రూపొందించారు. మహాగణపతికి ఇరువైపులా ప్రత్యేక ఆకర్షణగా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు.తొలి పూజల అనంతరం బడా గణేష్‌ను దర్శించుకునేందుకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
