Telangana Governor Shiv Pratap Shukla at khairatabad ganesh 2026
Khairatabad Ganesh 2026: ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల భారీ గణనాథుడికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో గవర్నర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించారు.
భారీ గణనాథుడి తొలిపూజ కార్యక్రమంతో ఖైరతాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Also Read :
Khairatabad Maha Ganapathi | ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి

Please tell us what is wrong. Your report will be sent to the website team.
