Telangana Heavy Rain Alert
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో నేడు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో (Telangana Heavy Rains Today ) భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
వర్షాలతో పాటు భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప వర్షం, ఉరుములు, పిడుగుల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
పొలాల్లో పనిచేసే రైతులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, పిడుగుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
