Accident
* బస్సు వేగానికి భారీ వృక్షం నేలకొరిగి..
* ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద పెను ప్రమాదం (Accident ) తప్పింది. సిరిసిల్ల డిపోకు చెందిన TS 23 T 8923 ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండ వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు వేగంగా మలుపు తిరిగే సమయంలో విద్యుత్ వైర్లు చుట్టుకోవడంతో సమీపంలోని భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది.
వృక్షం కూలడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్టు కూలిన సమయంలో సమీపంలో ప్రజలు లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదు. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
* బస్సు వేగమే కారణమా?..
బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా మలుపు తిప్పడం వల్లే ఈ ఘటన జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకోవడంతో చెట్టుపై ఒత్తిడి ఏర్పడి అది కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
* రంగంలోకి ట్రాఫిక్ పోలీసులు..
ఘటనతో పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకటరత్నం వెంటనే సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి, రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భారీ వృక్షం కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం (Accident) తప్పిందని స్థానికులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
