Nagarkurnool Farmers Protest
* నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో రైతుల ఆందోళన..
* అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, నాగర్కర్నూల్ : విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
బావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సబ్స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
*నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్..
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో పంటలపై ప్రభావం పడుతోందని రైతులు తెలిపారు. నిర్ణీత సమయాల్లో కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటం లేదని ఆరోపించారు.
తీగలపల్లి సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
రైతుల ధర్నాతో సబ్స్టేషన్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
