Mamitha Baiju
Mamitha Baiju: ఆకేరు న్యూస్, సినిమా: నివిన్ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.305 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది. థియేటర్లలోనూ సినిమాకు మంచి స్పందన కొనసాగుతోంది. ఈ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు.
మమితా సహజ నటి
ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు గిరీష్ ఏడీ సినిమా విశేషాలతో పాటు నటీనటుల గురించి మాట్లాడారు. నివిన్ పౌలి తన పాత్రకు చక్కగా సరిపోయారని పేర్కొన్నారు. యువ నటి మమితా బైజును ప్రత్యేకంగా ప్రశంసించారు.
“మమితా సహజ నటి. ‘సూపర్ శరణ్య’ సమయంలోనే ఆమెతో కలిసి పనిచేశాను. అప్పుడే ఆమెతో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాను. ఇప్పుడు ఆమె సాధిస్తున్న విజయాన్ని చూసి ఎంతో గర్వంగా ఉంది” అని గిరీష్ ఏడీ అన్నారు.
విడుదలపై ఆందోళన
‘బెత్లెహెం కుటుంబ యూనిట్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాల్లో కథానాయిక పాత్రలు ఒకే తరహాలో ఉండటంతో, రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదల కావడంపై ఆందోళన కలిగిందా? అని దర్శకుడిని ప్రశ్నించారు.
దీనిపై గిరీష్ స్పందిస్తూ.. రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం మొదట కొంత ఆందోళన కలిగించిందన్నారు. అయితే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తిగా భిన్నమైన చిత్రమని స్పష్టం చేశారు. సూర్య నటించినది తమిళ సినిమా కాగా, తమది మలయాళ చిత్రమని తెలిపారు. రెండు కథలు కూడా వేర్వేరని, తమ సినిమా రొమాంటిక్ కామెడీ అని పేర్కొన్నారు. రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావడం కేవలం యాదృచ్ఛికమేనని చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
