Mahabubabad
* మహబూబాబాద్ జిల్లాలో ఘటన..
* రూ.40 వేల విలువైన మద్యం తీసుకెళ్లారని ఆరోపణ
Mahabubabad: ఆకేరు న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సింహులపేట మండల కేంద్రంలోని మధుర వైన్స్ ఎదుట భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
తమ వద్ద ఉన్న సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని అబ్కారీ అధికారులు, వైన్ షాప్ సిబ్బంది తీసుకెళ్లారని ఆరోపిస్తూ దంపతులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
