Yashaswini Reddy
* పెండింగ్ పనులు పూర్తి చేయాలి..
Yashaswini Reddy: ఆకేరు న్యూస్, పాలకుర్తి: రాయపర్తి మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, సర్పంచులతో సమావేశం నిర్వహించారు.
గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయం, సాగునీరు, పింఛన్లు, రేషన్, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలపై సమీక్షించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని సూచించారు.
సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించిన యశస్విని రెడ్డి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిష్కరించాలని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.
రాయపర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
