Dornakal MLA Ramachandru Naik narrowly escaped a car fire
* Dornakal MLA కారు క్యాబిన్లో మంటలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామ పరిసరాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే (Dornakal MLA) రామచంద్రు నాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి ఎమ్మెల్యే వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులోని పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో కారు క్యాబిన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఎమ్మెల్యేను వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే రామచంద్రు నాయక్.. అనంతరం మరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
