Kalvakuntla Kavitha
* విశ్వకర్మల సంక్షేమానికి కవిత హామీ
Kalvakuntla Kavitha: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే విశ్వకర్మల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. పుస్తెలు, మెట్టెలను స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలా ప్రత్యేక జీవో తీసుకొస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైలుపైనే తన తొలి సంతకం చేస్తానని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశ్వకర్మల్లోని మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.
స్వర్ణకారుల కష్టాలు తెలుసు
కమర్షియల్ గోల్డ్ షాపుల ప్రభావంతో సంప్రదాయ స్వర్ణకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. ఈ వృత్తుల్లోని వారి సమస్యలను తాను దగ్గరగా చూశానని, గతంలో చట్టసభల్లోనూ వారి తరఫున మాట్లాడినట్లు తెలిపారు. వడ్రంగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, శిల్పులకు దేవాలయాల కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు.
భూలక్ష్మీ పథకం
సొంత భూమి లేని నిరుపేదలకు భూమి అందించాలనే ఉద్దేశంతో ‘భూలక్ష్మీ’ పథకాన్ని రూపొందించినట్లు కవిత తెలిపారు. ఈ పథకానికి మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి స్ఫూర్తి అని పేర్కొన్నారు. విశ్వకర్మల సంక్షేమం కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని ఆమె కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
