Telangana Praja Palana Day
Telangana Praja Palana Day: ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల రుణాలు
జిల్లాలోని 265 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
