Telangana Assembly
Telangana Assembly: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఎల్నినో పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. వర్షాల ఆలస్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
నీటి నిల్వలు తగ్గాయి
గత ఏడాది ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్లలో సుమారు 500 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 240 టీఎంసీలకు తగ్గిందని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత సగానికి తగ్గిందని వెల్లడించారు.
రైతులపై ప్రభావం
వర్షాలు ఆలస్యం కావడంతో పాటు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వ్యవసాయంపై ప్రభావం చూపుతోందని ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ వాతావరణ, నీటి పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులపై చర్చించడమే తమ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
