Kalyanam Kamaneeyam Jeevitham
Kalyanam Kamaneeyam Jeevitham: ఆకేరు న్యూస్, సినిమా: ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోహీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కళ్యాణం కమనీయం జీవితం వి.వి.ఫై మీడియా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు సినిమా చూపించామని తెలిపారు. సినిమా బాగుందని వారు ప్రశంసించారని చెప్పారు. కుటుంబం, యువతను ఆకట్టుకునేలా దర్శకుడు రవి లోకిరెడ్డి సినిమాను రూపొందించారని అన్నారు. ఈ చిత్రానికి శ్రీ మురళీ కార్తికేయ మంచి సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు.
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. టైటిల్ నచ్చడంతో నిర్మాతలు సినిమాను ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. సినిమాలో మంచి కథ, పాటలు, భావోద్వేగాలతో పాటు పలు ట్విస్టులు ఉంటాయని చెప్పారు. కొత్త నటీనటులు అయినప్పటికీ అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. రూ.100 టికెట్ కొనుగోలు చేసి సినిమా చూస్తే అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పొందుతారని దర్శకుడు అన్నారు. సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమా విడుదలవుతుందని తెలిపారు.
కీలక పాత్రలో నటించిన విషిక మాట్లాడుతూ.. దర్శకుడు రవి పడిన కష్టాన్ని దగ్గరుండి చూశానని తెలిపారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నానన్నారు. ప్రేక్షకులను తప్పకుండా సంతృప్తిపరుస్తామని చెప్పారు. హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. సెప్టెంబర్ 18న విడుదల చేయాల్సిన సినిమాను సెప్టెంబర్ 25కి వాయిదా వేసినట్లు తెలిపారు. అదే రోజున నాని నటించిన పారడైజ్ కూడా విడుదలవుతున్నప్పటికీ, తాము ఎవరితోనూ పోటీ పడటం లేదని స్పష్టం చేశారు. నాని తనకు ఇష్టమైన నటుడని, ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పారు. కళ్యాణం కమనీయం జీవితం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తమ సినిమాను ఆదరించాలని కోరారు.
హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు కూడా అదే ప్రేమతో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు నటించారు. ఎన్సీ అరవింద్ ఏకలవ్య కథ, రచన అందించగా.. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం, వెంకటరాజు డి.ఐ.ఓ.పీ. బాధ్యతలు నిర్వహించారు. సతీష్ సిగిరెడ్డి కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
