Kamalapur
* ఈ నెల 25లోపు పూర్తి చేయాలని ఏడీఏ ఆదిరెడ్డి ఆదేశం
Kamalapur: ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వేను ఈ నెల 25లోపు వందశాతం పూర్తి చేయాలని హనుమకొండ ఏడీఏ ఆదిరెడ్డి సూచించారు. మండలంలోని ఉప్పల్, నేరెళ్ల, వంగపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను మండల ఏవో బి.వేణుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతులు సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను వాలంటీర్లు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. మండలాన్ని జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వేలో మొదటి స్థానంలో నిలపాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు.
ఎరువుల విక్రయాలపై హెచ్చరిక
సర్వే పరిశీలనతో పాటు మండలంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలను ఫర్టిలైజర్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలని ఏడీఏ ఆదిరెడ్డి డీలర్లను ఆదేశించారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, గడువు ముగిసిన పురుగుమందులను అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లేకుండా పురుగుమందులు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు టి.తిరుపతి, బి.ప్రశాంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రతాప్, రహీమ్ పాషా, వాలంటీర్లు అనురాగ్, రాము, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
