Good Boys First Look
Good Boys First Look: ఆకేరు న్యూస్, సినిమా: ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా గుడ్ బాయ్స్ మూవీ మేకర్స్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాఘవ్ కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్నారు.
క్రేజీ గ్యాంగ్‌కు లీడ్‌గా
మోషన్ పోస్టర్లో వెన్నెల కిశోర్ ఓ క్రేజీ గ్యాంగ్‌కు లీడ్‌గా కనిపిస్తున్నారు. ఫుల్ కామెడీ, గందరగోళం, ఊహించని అడ్వెంచర్లతో సినిమా సాగనున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. వీళ్లు హీరోలు కాదు.. అసలు హీరోలకు దగ్గరగా కూడా రారు. కానీ విలన్లను ఎదుర్కొనేంత పిచ్చి ఉన్నవాళ్లు మాత్రం వీళ్లే అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల విడుదలైన కజిన్స్ ఆర్ కమింగ్ ప్రమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంది. ప్రధాన నటీనటులతో రూపొందించిన ఆ వీడియోలోని ఫన్నీ సన్నివేశాలు, విభిన్నమైన క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. వెన్నెల కిశోర్, శృతి సోధి, వైవా హర్ష, హైపర్ ఆది, రఘుబాబు, రవి రాజా, వామ్సీ గౌడ్, గుండు సుదర్శన్, కిరణ్ మచ్చా, ఢీ పండు, రమణ భార్గవ్, అశ్విని అయ్యలూరు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ గోవిందరాజన్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్ బాయ్స్ నవ్వులు, స్నేహం, కామెడీ ప్రధానంగా సాగే ఎంటర్టైనర్గా రూపొందుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
