Dharmavaram
* రూ.1.45 లక్షలకు వినాయకుడి లడ్డూ
ఆకేరు న్యూస్, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ముస్లిం దంపతులు పాల్గొని రూ.1.45 లక్షలకు వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
రూ.1.45 లక్షలకు లడ్డూ
ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాందిని, మస్తాన్ వలి దంపతులు కూడా వేలంలో పాల్గొన్నారు. చివరకు రూ.1,45,000కు అత్యధిక ధరకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
సోదరభావానికి ప్రతీకగా..
ముస్లిం దంపతులు వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకోవడం స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది. మతాలకు అతీతంగా ఉత్సవంలో పాల్గొని సోదరభావాన్ని చాటిన దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ ఘటనపై భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. పండుగలు మతాలకు అతీతంగా ప్రజల మధ్య పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
