Ponnam Prabhakar
* 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్ చేర్చాలి
Ponnam Prabhakar: ఆకేరు న్యూస్, హైదరాబాద్: 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీల వాస్తవ జనాభా గణాంకాలు తేలితేనే జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమంలో న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ ఓబీసీ సదస్సులో పాల్గొన్న ఆయన.. తెలంగాణలో కులగణన పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే విధానంలో కులగణన నిర్వహించాలని కోరారు.
బీసీల జనాభా, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిపై పునరాలోచన అవసరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఐక్య కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
