ఆకేరు న్యూస్, స్టేషన్‌ఘన్‌పూర్: కడియం శ్రీహరిని విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కనకం రమేష్ హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ రాజయ్య.. తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని రమేష్ అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.
కడియం శ్రీహరి హయాంలో వంద పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ కళాశాల, బంజారా భవన్, రోడ్లు, సాగునీటి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కడియం శ్రీహరి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఎంపీ కడియం కావ్యపై విమర్శలు చేయడం కూడా సరికాదని రమేష్ అన్నారు. గడ్డి మందు నిషేధం, కాజీపేట బస్టాండ్‌కు స్థల సేకరణ, లీడ్ క్యాప్‌తో పాటు వరంగల్ ప్రాంత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ఆమె కృషి చేస్తున్నారని తెలిపారు.
రాజయ్య అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని, ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని రమేష్ పేర్కొన్నారు. దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సొంత పార్టీ నేతలు చేసిన విమర్శలను రాజయ్య ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజల తరఫున నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ స్వామి నాయక్, మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్, సున్నం యాదగిరి, కుందూరు వెంకటరెడ్డి, సింగపురం వెంకటయ్య, ఫాతి కుమార్, తోకల సమ్మయ్య, సోన్నా శ్రీనివాస్, గద్దల యాదగిరి, సంజీవ, గాలి కొమురయ్య, యాదగిరి, సంపత్, లక్ష్మణ్, కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
