Malkajgiri
* రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు
* ఇద్దరు అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ (MDMA) సరఫరా చేస్తున్న ఇద్దరిని మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో నిందితుల నుంచి 23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.76 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు మొబైల్ ఫోన్లు, రూ.5,600 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
* రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ
పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మహావీర్ సింగ్ సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఉంటూ రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జోధ్‌పూర్‌కు చెందిన కుల్దీప్ వద్ద ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి పలువురికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.
* రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్
మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో డ్రగ్స్ విక్రయించేందుకు నిందితులు వేచి ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన 23 గ్రాముల ఎండీఎంఏ లభించినట్లు తెలిపారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
* పరారీలో మరో ఇద్దరు
ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు పేర్కొంటున్న జోధ్‌పూర్‌కు చెందిన కుల్దీప్, కోకాపేటకు చెందిన కైలాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలిస్తూ డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
