TG HMA
TG HMA: ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ (TG HMA) జనగామ జిల్లా పాలకుర్తి మండల శాఖ 2026–28 నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం మండల కేంద్రంలో ప్రశాంతంగా జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్ పి. నరసయ్య, అబ్జర్వర్ పి. శోభారాణి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం
మండల అధ్యక్షుడిగా డాక్టర్ కందికట్ల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఎన్. దేవేందర్, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్లుగా పి. రమేష్, కే. అనిత ఎన్నికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
ఎన్నికైన అనంతరం అధ్యక్షుడు డాక్టర్ కందికట్ల వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా TG HMA మండల శాఖ పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పెంపు కోసం ప్రధానోపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేస్తామన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సేవాపరమైన, పరిపాలనాపరమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ నాయకులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
