Telugu University
* ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం..
* ఆకట్టుకున్న జానపద కళాప్రదర్శనలు
Telugu University| ఆకేరు న్యూస్, హైదరాబాద్: బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. క్యాంపస్లో ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జనోత్సవాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. జానపద విభాగం విద్యార్థుల కోలాటాలు, చెక్కభజనలు, భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లడ్డూ వేలంతో ఉత్సాహం
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. వాసు వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం విద్యార్థులు, సిబ్బంది మంగళహారతులు నిర్వహించారు. ప్రొ.డా. రాధ, సారంగపాణి, ప్రొ.డా. పద్మప్రియ, డా. రత్నశ్రీ, డా. షేక్ హసీనా, శ్రీధర్, రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణేష్ కమిటీ సభ్యులు కే. నర్సప్ప, ఎస్. భానుచందర్, వై. అనిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జానపద కళాకారుల కోలాటాలు, చెక్కభజనలతో యూనివర్సిటీ ఆవరణ సందడిగా మారింది. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై నినాదాల మధ్య శోభాయాత్ర నిర్వహించి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
