Kadiyam Srihari
* కడియం శ్రీహరి
Kadiyam Srihari| స్టేషన్ ఘన్పూర్: గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే రాజకీయ పార్టీ బలంగా ఉంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్‌లో మంగళవారం మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం, మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి.. అంతకుముందు వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.14.28 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కొత్త, పాత అనే తేడాలు లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలని, పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించాలని అన్నారు. పార్టీ నిబంధనలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, స్వంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్దే వెంకన్న, బేతి జయపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన పలువురు
రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ సర్పంచ్ ఇల్లందుల రవి, వార్డు సభ్యులతో పాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ తోటకూర సదానందం, వార్డు సభ్యులు ఉల్లి ఉపేంద్ర కుమారస్వామి, గొడుగు లావణ్య రాజు, వల్లెపు రాజు రజిత, నాయకులు మునిగాల మల్లేశం, వల్లెపు కుమార్, యూత్ నాయకుడు జినుకుల సతీష్‌తో పాటు మరో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో పార్టీలో చేరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
