Hyderabad Drugs
* డ్రగ్స్‌తో ఇద్దరి అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని భోద్పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ తీసుకొచ్చిన మహావీర్ సింగ్, లక్ష్మణ్ సింగ్ రాజ్‌పురోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు.
ర్యాపిడో డ్రైవర్‌గా..
రాజస్థాన్‌కు చెందిన మహావీర్ సింగ్ ర్యాపిడో డ్రైవర్‌గా, లక్ష్మణ్ సింగ్ బోయిన్‌పల్లిలో క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాజస్థాన్‌కు చెందిన కుల్దీప్ అనే పెడ్లర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వేపచెట్టు కింద వేచి..
ఈ నెల 21న భోద్పూర్ నుంచి ఎండీఎంఏ తీసుకొచ్చిన ఇద్దరూ మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని వేపచెట్టు కింద కస్టమర్ల కోసం వేచి ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా 23 గ్రాముల డ్రగ్స్ లభించింది. ప్రధాన పెడ్లర్ కుల్దీప్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
