Delhi Crime
Delhi Crime| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: పోలీసులమంటూ నటించి 17 ఏళ్ల బాలికను ఆమె స్నేహితుడి నుంచి విడదీసి లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ న్యాయవాది, అతని సోదరుడు ఉన్నారు.
కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్తా కుంజ్ పార్క్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలిక, ఆమె 17 ఏళ్ల స్నేహితుడు పార్క్‌లో ఉండగా ముగ్గురు వ్యక్తులు పోలీసులమంటూ వచ్చి వారిని బెదిరించినట్లు చెప్పారు. అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులపై బీఎన్ఎస్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుల్లో అసిఫ్‌ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి కాలికి బుల్లెట్ తగలడంతో ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. మరో ఇద్దరిని వారి నివాసం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపణలను ఖండిస్తూ, తమ కుమారులను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
