DOST Admissions
* రేపటి నుంచే ప్రవేశాలు..
* స్థానికేతరులకూ అవకాశం
DOST Admissions| ఆకేరు న్యూస్, డెస్క్: డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దోస్త్ (DOST) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుంది. సెప్టెంబర్ 24 నుంచి రెండు విడతల్లో ఈ ప్రవేశాలు జరగనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి తెలిపారు.
రాష్ట్ర విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా స్పాట్ ప్రవేశాలకు అర్హులు. అయితే ఒకే సీటుకు పోటీ ఉంటే స్థానిక విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.
ఫీజు రీయింబర్స్మెంట్ లేదు
స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీటు పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
షెడ్యూల్ ఇదే
సెప్టెంబర్ 23: దోస్త్ వెబ్సైట్లో ఖాళీ సీట్ల వివరాలు.
సెప్టెంబర్ 24–25: ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సులకు తొలి విడత.
సెప్టెంబర్ 28–29: అన్ని కళాశాలల్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెండో విడత.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
