Bank Holidays
* సెప్టెంబర్ 28–30 సమ్మె..
* 25లోపు పనులు పూర్తి చేసుకోండి
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సమాఖ్యల ఐక్య వేదిక (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలు మూసివేయబడనున్నాయి.
సెప్టెంబర్ 25లోపు పనులు పూర్తి
సెప్టెంబర్ 30 అర్ధవార్షిక ముగింపు రోజు కావడంతో వ్యాపారులు, కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చెక్కుల జమ, క్లియరింగ్, డ్రాఫ్ట్‌ల జారీ, పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ వంటి సేవలకు అంతరాయం కలగవచ్చు. దీంతో అత్యవసర బ్యాంకింగ్ పనులను సెప్టెంబర్ 25లోపు పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
డిజిటల్ సేవలు కొనసాగింపు
శాఖలు మూసివేసినా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ యంత్రాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ కరస్పాండెంట్ (BC), కస్టమర్ సర్వీస్ పాయింట్లలో నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
సమ్మెకు కారణాలివే
వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో పాటు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానంపై యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే అక్టోబర్ 26 నుంచి మరింత విస్తృతంగా సమ్మె చేపడతామని UFBU హెచ్చరించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
