BRS leaders in Station Ghanpur defended former MLA Thatikonda Rajaiah
* బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను విమర్శించడం సరికాదని బిఆర్ఎస్ నాయకులు మాచర్ల గణేష్, పల్లెపాటి జైపాల్ రెడ్డి, చౌదర్పల్లి శేఖర్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేపదే కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి నీ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెచ్చిన ఘనత రాజయ్య ది అన్నారు.
2004 నుండి 2023 వరకు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాజయ్య పని చేశారన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం మానుకొని చేతనైతే జీవో నెంబర్ 79 రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఇకపై కాంగ్రెస్ నాయకులు, చోట మోట లీడర్లు మా రాజయ్యను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.
సమావేశంలో కౌన్సిలర్లు తాటికొండ మధు, బాలగాని అనిల్, పొన్న రాజేష్, చల్ల రఘు నాయకులు శీలం శ్యామ్, చల్లారెడ్డి, గుండా మల్లేష్, చింత శ్రీనివాస్, గట్టు సాయి కృష్ణ, మారేపల్లి ప్రసాద్, అశోక్, హిరసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
