Srikakulam Train Accident
* రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు మృతి
ఆకేరు న్యూస్, టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న ఐదుగురు యువకులను రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రూర్కెలా నుంచి గుణుపూర్ వెళ్తున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు, గాయపడిన వ్యక్తి డమర ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. అయితే వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
