Damodar Rajanarsimha Helicopter
* ఇంధనం లేక మంత్రి హెలికాప్టర్ నిలిచిపోయింది
* రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు పయనం
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని పరిశీలించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదిలాబాద్‌కు వెళ్లారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు.
ఆస్పత్రి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యుత్ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, భవన భద్రతను పరిశీలించాలని ఆదేశించారు.
పర్యటన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో (Damodar Rajanarsimha Helicopter) మంత్రి రోడ్డు మార్గంలో బయలుదేరారు. హెలికాప్టర్‌కు ఇంధనాన్ని మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తెప్పించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
