MeeSeva Door Delivery
* డోర్ డెలివరీకి శ్రీకారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇకపై మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పలు ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించేలా మీసేవ డోర్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ఈ సేవలను ప్రారంభించారు.
ఈ సేవల ద్వారా ప్రజలు 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న సమయంలో మీసేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకు వెళ్లి అవసరమైన సేవలను అందించనున్నారు.
ప్రధానంగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు వంటి సేవలు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈసీ కాపీలు, పోలీస్ శాఖకు సంబంధించిన పలు సేవలు కూడా డోర్ డెలివరీ విధానంలో అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఐజీఆర్ఎస్ (IGRS) సేవలను కూడా ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అమలు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను పరిశీలించిన అనంతరం మీసేవ డోర్ డెలివరీ సేవలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
