Talakayala Gutta Rain Pray Village People
* వైద్యనాథుడికి అన్నాభిషేకం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రం దేవాదుల రిజర్వాయర్ అనుకుని ఉన్న తలకాయల గుట్ట వద్ద వర్షాలు కురవాలని వైద్యనాధుడికి అన్నాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. లోకా కళ్యాణార్థం నాడు కాకతీయులు కరువు కాలంలో ఆమహదేవుణ్ణి సేవించి చెరువులు తవ్వించారు.
ఆ చెరువుల దగ్గర ప్రళయ కాల రక్షకుడైన ఆ మహాదేవుని ఆలయాలను నిర్మించి స్వామి వారి సేవలో ఉంటూ ఆ మహాదేవుని అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండి రాజ్యాన్ని సుభిక్షంగా సుసంపన్నంగా మారాయని చరిత్ర.
సూపర్ ఎల్నినో నుండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని వర్షాలు కురిపించాలని వేడుకుంటూ కాకతీయుల భక్తి ప్రశిస్తానికి ప్రత్యేక అయిన భైరవ గుట్ట (తలకాయల గుట్ట) పై కోలువైన శ్రీ శ్రీ శ్రీ వైద్యనాధస్వామిని వేడుకుంటూ స్వామి వారికి అన్నభిషేకది పూజలు నిర్వహించారు. శ్రీ హనుమాన్ దీక్ష స్వాములకు, భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని అని శివ భక్తుడు భునేటీ కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ ధార్మిక కార్యక్రమంలో హనుమాన్ స్వాములు నీల గట్టయ్య, గోనెల ఎల్లయ్య, ఎల్లయ్య, గోనెల శ్రీనివాస్, కుమార్, పవన్, వైశ్య సంఘం అధ్యక్షులు బీజేపీ ధరిక్ సెల్ కోకన్వీనర్ సోమశేఖర గుప్త, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, లింగయ్య, జవహర్ లాల్ నాయక్, సునీల్ నాయక్ హనుమాన్ దీక్ష స్వాముల, భక్తులు స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
