Singareni Head Office
* భారీగా పోలీసుల మోహరింపు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : లక్డీకాపుల్‌లోని సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై వాస్తవాలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సింగరేణి కార్యాలయం పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. కార్యాలయం వద్దకు వచ్చే వారిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
సింగరేణిలో జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న అక్రమాలు, సంస్థకు సంబంధించిన పలు అంశాలపై వివరాలు తెలుసుకునేందుకే హెడ్ ఆఫీస్ సందర్శన చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నేతల పర్యటన నేపథ్యంలో లక్డీకాపుల్ పరిసరాల్లో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
