Vinay Kumar Station Ghanpur
* బీఆర్ఎస్ నేతలకు వినయ్ కుమార్ కౌంటర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : మా ప్రభుత్వంలో మీరు జీవోలు తెచ్చారా? మీరు జీవోలు తెస్తే పనులు ఎందుకు ప్రారంభించలేదు ? వాస్తవ విరుద్ధ ఆరోపణలు చేసే బిఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్ హిత బోధ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్న మా నాయకుడు కడియం శ్రీహరి ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాడు అన్నారు. అందులో భాగంగానే గడచిన మూడేళ్లలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెవిన్యూ డివిజనల్ ఆఫీస్, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, మున్సిపాలిటీ ఏర్పాటుతోపాటు 50 కోట్ల నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేత కడియం శ్రీహరి అన్నారు.
డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆ తర్వాత నవంబర్ 16, 20204న 4 ఎకరాల ఆర్టీసీ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు బదిలాయించారన్నారు. జనవరి 25, 2025న మున్సిపాలిటీ ఏర్పడిందన్నారు, నవంబర్ 15, 2024న డిగ్రీ కళాశాల మంజూరి అయిందన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వచ్చాయ తప్ప మీరు మీ ఎమ్మెల్యే తెచ్చినవి కాదన్నారు. మేమే తెచ్చామని చెప్పుకునే మీరు జీవోలు ఎందుకు తేలేదు, పనులు ఎందుకు ప్రారంభించలేదని చైర్మన్ వినయ్ కుమార్ బి ఆర్ ఎస్ నాయకులను ప్రశ్నించారు.
2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదులకు శంకుస్థాపన చేస్తే 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ రాజయ్య ప్రాజెక్టును ఎలా తెచ్చాడని ప్రశ్నించారు. పనులు, పదవులు అమ్ముకున్న ఘనత గల మాజీ ఎమ్మెల్యే రాజయ్య ‘సెల్ఫ్ హిట్’ అయ్యాడు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం ఫ్రాకులాడుతున్న టిఆర్ఎస్ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితబోధ చేశారు.
కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. అవస్తవాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నంలో మా నేతను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు నాయకులు బూర్ల శంకర్, కొంతం శ్రీనివాస్, నీలగట్టయ్య, పోగుల సారంగపాణి, పెసర సారయ్య, నక్క పాపయ్య, గట్టు కోటి, మాతంగి బాబు, మాతంగి దేవయ్య, మేకల మల్లేశం, గట్టు కోటి, జీడి ప్రసాద్, పొన్న రాజయ్య, వెంకటేశ్వర్లు, సింగపురం దయాకర్, గన్ను నరసింహులు, గట్టు(మెట్టెల్లి) రమేష్, చింత ఎల్లయ్య, నీల సోమయ్య, పోస్ట్ రాజు, గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
