Matsya Glimpse
* స్టైలిష్ లుక్లో వివస్వాన్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : హీరో వివస్వాన్ నటిస్తున్న అడ్వెంచర్ ఫిలిం “మత్స్య”. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. “మత్స్య” సినిమా అఫీషియల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసింది.’అమ్మా కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..! అంటూ బాబు అమ్మను అడగగా, ఒక ఫిష్ కథ చెప్పనా అంటూ అమ్మ చెప్పే డైలాగ్ తో “మత్స్య” గ్లింప్స్ మొదలవుతుంది. ఎన్నో వింతలు, అద్భుతాలు, ఒక ట్రావెలర్ ఉండే ఆ కథను అమ్మ చెబుతుంటే హీరో క్యారెక్టర్ ను కలర్ ఫుల్ గా పరిచయం చేశారు.
గ్లింప్స్ లో వివస్వాన్ స్టైలిష్ లుక్, అప్పీయరెన్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంతో ఒక ప్రామిసింగ్ యంగ్ హీరోగా వివస్వాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. గ్లింప్స్ చివరలో హీరో ఉన్న బోట్ కింద నుంచి మిథికల్ ఫిష్ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది.
“మత్స్య” చిత్రంలో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల, ఎడిటర్ పి.ఎస్.రెడ్డి, డీవోపీ సురేష్, మ్యూజిక్ ఉజ్వల్ గుప్తా,డైలాగ్స్ జే కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజీవనేత్ర.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
