Kazipet Murder Case
* తల్లి హత్య కేసులో కుమారుడిపై ఆరోపణలు
ఆకేరు న్యూస్, కాజీపేట : కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ, బాలాజీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. ఉదయశ్రీ (40) అనే మహిళను ఆమె కుమారుడు దొరబాబు (20) హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దొరబాబు డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం.
తల్లి ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్న విషయంపై కుమారుడు గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తల్లికి పలుమార్లు చెప్పినప్పటికీ వినకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే హత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
