Krithi Shetty
*ట్రెడిషనల్ లుక్‌తో అదరగొట్టేసింది
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.
‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్ కృతి శెట్టి (Krithi Shetty) ‘దీపు’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో కృతి శెట్టి (Krithi Shetty) ట్రెడిషనల్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. పర్పుల్-పింక్ కలర్ హాఫ్ సారీలో అందంగా కనిపించారు. ఆమె ఆహ్లాదకరమైన చిరునవ్వు ఈ ఫస్ట్ లుక్కు మరింత చార్మ్, ఎలిగెన్స్‌ను తీసుకొచ్చింది.ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌కు తోడు కీర్తి సురేష్, కృతి శెట్టి లాంటి స్టార్స్ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రం ఫెస్టివల్ సీజన్లో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది.
ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
