Palakurthi Gurukulam
* 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో ఎలుకలు విద్యార్థినులను కరిచిన ఘటన కలకలం రేపింది. మొత్తం 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం.
రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు విద్యార్థినులపైకి వచ్చి చేతులు, కాళ్లపై కరిచినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, ఎలుకలు కరిచిన విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఒక్కసారిగా 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గురుకుల పాఠశాలలో ఎలుకల బెడద ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఎలుకల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
