Minister Tour
* 12 మండలాలకు ప్రత్యేక గ్యాలరీలు
* కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆకేరు న్యూస్, జనగామ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 26న జనగామ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి మున్సిపల్ కార్యాలయం, ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో జిల్లాలోని 12 మండలాలకు 12 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు సరిపడా కుర్చీలు, బారికేడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్, భద్రత, విద్యుత్, తాగునీరు తదితర అంశాల్లో ముందస్తు చర్యలు చేపట్టి, మంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
