Seethakka
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2025–26 సీఆర్ఆర్ నిధులు రూ.1.80 కోట్లతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీదేవిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025–26 నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
అదే గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షల అంచనా వ్యయంతో, సీఆర్ఆర్ ప్లెయిన్ నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను కూడా సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

