Ailamma Jayanti
Ailamma Jayanti| ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మేర గ్రామానికి చెందిన మాడరాజు యాకయ్య నియమితులయ్యారు.
ఈ సందర్భంగా మాడరాజు యాకయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, రజక కార్పొరేషన్ చైర్మన్ దాసరాజు అజయ్ కుమార్, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేతురీ వెంకటేశం, ఉద్యమ నేత గంపల శ్రీనివాస్, కల్లెట్లపల్లి వెంకట్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తిని చాటేలా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని యాకయ్య పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
